News September 8, 2024
గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ దంపతులు
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎంపీ నాగరాజు కోరారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండపాలతో కళకళలాడాల్సిన సమయంలో విజయవాడలో కురిసిన భారీ వర్షాలు, వరదలు అక్కడి ప్రజలను తీవ్ర కష్టాలపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 5, 2024
కర్నూలు: నీటి కుంటలో పడి ఇద్దరు పిల్లల మృతి
నందవరం మండలం మాచాపురంలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు బైరి ఉదయ్ కుమార్(6), అనుమేశ్ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లల మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు
ఈనెల 6 నుంచి 13 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వీరేశ్ ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి షేక్షావల్లి తెలిపారు. శనివారం కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో వీరేశ్‌ను సత్కరించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కోచ్ యుసుఫ్ బాషా పాల్గొన్నారు.
News October 5, 2024
బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. శనివారం దేవరగట్టును ఆయన సందర్శించి మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా జరుపుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు గట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.