News October 9, 2024
గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.
Similar News
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.
News December 12, 2025
ఖమ్మం జిల్లాలో FINAL పోలింగ్ శాతం

ఖమ్మం జిల్లాలో 192 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 90.08 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
News December 12, 2025
H.I.V వ్యాక్సిన్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: హెచ్.పి.వి. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జడ్పి కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.


