News October 9, 2024

గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.

Similar News

News November 13, 2024

భద్రాద్రి రామయ్య దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదపండితుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News November 13, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15న గురునాయక జయంతి, 16, 17న వారాంతపు సెలవు కారణంగా మూడు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 18 సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారస్థులు గమనించాలని కోరారు.

News November 13, 2024

KCR పాలనలో అవినీతిపై భద్రాచలం నుంచి పాదయాత్ర: TRS

image

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.