News October 13, 2024
గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల

గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News November 26, 2025
GNT: ఎండీఎంఏ రవాణాపై పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

గుంటూరులో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా మరింత కఠినమైంది. ఒక వారం వ్యవధిలో ఎండీఎంఏ కొనుగోలు,అమ్మకాలకు సంబంధించిన ఎనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎలక్ట్రానిక్ పరికరాల్లో డ్రగ్స్ దాచి యువతకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వృత్తి విద్య చదువుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని అలవాటు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. బెంగళూరు–గుంటూరు మార్గంలో రవాణాపై నిఘా కొనసాగుతోంది.
News November 24, 2025
ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.
News November 24, 2025
అమరావతి: 10 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తి

అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా NGO టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను L&T కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను లాస్ట్ టైమ్ ఇంజరీ లేకుండా విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాధించిన మైలురాయి నిర్మాణ రంగంలో CRDA పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమన్నారు.


