News September 10, 2024
గత ప్రభుత్వ మైకం నుంచి అధికారులు బయటపడాలి: ఎంపీ
కొందరు అధికారులు గత ప్రభుత్వ మైకంలోనే ఉన్నారని, వాటి నుంచి బయటపడాలని, గతం ఒక లెక్కా, ఇప్పటి నుంచి మరో లెక్క అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులందరం కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News October 5, 2024
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైనట్లు పేర్కొన్నారు.
News October 5, 2024
కృష్ణగిరిలో 48.2 మి.మీ వర్షం
కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. కృష్ణగిరిలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 25 మండలాల్లో వాన పడింది. జిల్లాలో సగటున 12.6 మి.మీ వర్షం నమోదైంది. అత్యల్పంగా ఎమ్మిగనూరులో 2.4, చిప్పగిరి 2.0, హాలహర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయి. నేడు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు.
News October 5, 2024
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు సెలవు
ఆదోనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండగా తుఫాను ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్‌కు తెచ్చిన వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయని తెలిపారు.