News February 1, 2025

గద్దర్‌కు నివాళి అర్పించిన మంత్రి సురేఖ

image

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గద్దర్ సేవలను మంత్రి కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన ఆట-పాటలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ కవి గద్దర్ అని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.

Similar News

News December 5, 2025

TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

image

TG: ఇన్‌సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్‌కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్‌ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.

News December 5, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్ 67 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, మహిళలు, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 5, 2025

మహబూబ్‌నగర్: వేలం పాటతో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: అరుణ

image

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎంపీ డి.కె.అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని సర్పంచ్‌ను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవం మంచిదే అయినా, డబ్బులతో కాకుండా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.