News February 1, 2025
గద్దర్‌కు నివాళి అర్పించిన మంత్రి సురేఖ

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గద్దర్ సేవలను మంత్రి కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన ఆట-పాటలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ కవి గద్దర్ అని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.
Similar News
News February 7, 2025
మరోసారి SA20 ఫైనల్‌కు సన్‌రైజర్స్

‘SA20’లో ఎలిమినేటర్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలిచి సన్‌రైజర్స్(SEC) ముచ్చటగా మూడోసారి ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 175/4 స్కోరు చేసింది. రూబిన్(81), ప్రిటోరియస్(59) రాణించారు. ఛేజింగ్‌లో SEC ఓపెనర్ జోర్జీ(78), జోర్డాన్(69) తడబడకుండా ఆడారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టైన్(MICT)తో రేపు రాత్రి 9గంటలకు సన్‌రైజర్స్ తలపడనుంది. మార్క్రమ్ సేన తొలి రెండు సీజన్లు కప్ కొట్టిన సంగతి తెలిసిందే.
News February 7, 2025
వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు.. టెన్త్ కూడా

AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.
News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.