News April 6, 2025
గద్వాలలో ఉప ఎన్నికలు: KCR

గద్వాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయని.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించినట్లు BRS గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం KCR అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు హనుమంతు నాయుడు తెలిపారు.
Similar News
News April 17, 2025
సంగారెడ్డి: స్కావెంజర్ వేతనాలు విడుదల

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం నియమించుకున్న పారిశుధ్ధ్య కార్మికుల ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి వారికి చెల్లించాలని సూచించారు.
News April 17, 2025
గద్వాల: ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

గద్వాల ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వివిధకంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 17, 2025
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.