News March 7, 2025

గద్వాలలో బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ

image

గద్వాల జిల్లా కేంద్రంలోని రాజా వీధిలో బంగారు వ్యాపారి సంజీవ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు సంజీవ్ కథనం ప్రకారం వివరాలు.. గురువారం ఉదయం తమ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 7 తులాల బంగారము 5.1/4 కేజీల వెండి, రూ.1 లక్ష 30 వేల నగదు అపహరించారని తెలిపారు. ఘటనా స్థలానికి పట్టణ ఎస్ఐ కళ్యాణ్ చేరుకొని వేలు ముద్ర ఆధారాలు స్వీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 9, 2025

ప్రత్తిపాడు: జనసేన ఇన్‌ఛార్జ్ తమ్మయ్యబాబు సస్పెండ్

image

ప్రత్తిపాడు జనసేన ఇన్‌ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు స్థానిక సీహెచ్సీ వైద్యురాలిపై విరుచుకుపడ్డ విషయం విధితమే. ఒక పక్క పార్టీ కార్యాలయం విచారణకు ఆదేశించింది. ఆదివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ వేములపాటి అజయ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సంచలనంగా మారింది. తప్పు చేసిన వారిని పవన్ వదలరు అనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

News March 9, 2025

మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ

image

AP: మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News March 9, 2025

BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.

error: Content is protected !!