News April 16, 2025

గద్వాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మానవపాడు మండలం క్రాస్ రోడ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్న గుర్తుతెలియని తెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి మానవపాడు పోలీసులు చేరుకున్నారు.

Similar News

News October 31, 2025

మందలిస్తారని.. పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థి

image

టీచర్లు మందలిస్తారని భయపడి పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె SI ఉమా మహేశ్వర రెడ్డి వివరాల మేరకు.. మదనపల్లె చీకులబైలుకు చెందిన శివ కుమారుడు చరణ్ తంబళ్లపల్లె ST గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి స్నేహితుడితో గొడవపడ్డాడు. టీచర్లు మందలిస్తారని బయపడి శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి పారిపోయాడు. తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 31, 2025

కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం.. డ్రైవర్ కోసం గాలింపు

image

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలోని నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభించింది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా ఆ వ్యాన్‌ను బయటకు తీశారు. అయితే, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

News October 31, 2025

ఆదిలాబాద్: విద్యతో పాటు సృజనాత్మకత అవసరం: కలెక్టర్

image

యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ‘బోస్ ఫెలోషిప్’ సామాజిక సంస్థ భారత్ దేకో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. సమాజంలో స్థిరమైన మార్పు రావాలంటే విద్యతో పాటు సమర్థవంతమైన నైపుణ్యాలు కూడా అవసరమన్నారు.