News March 16, 2025

గద్వాలలో వ్యక్తి మృతి

image

ఉండవెల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా సమీపంలో మానోపాడు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అలంపూర్ చౌరస్తా నుంచి చెన్నిపాడు వైపునకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలంపూర్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News March 16, 2025

మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు కన్నుమూత

image

రాజవంశీకుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు అర్వింద్ సింగ్ మేవార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ రాజస్థాన్‌లోని సిటీ ప్యాలెస్‌లో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రంజీల్లో రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. పూర్వీకుల ఆస్తులపై న్యాయపోరాటం చేస్తూ మేవార్ ఫ్యామిలీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రేపు అర్వింద్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

News March 16, 2025

మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్..!

image

HYD మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్‌లు తీవ్ర వివాదాని దారితీశాయి. HML ఎండీ NVS రెడ్డికి బెట్టింగ్ యాప్స్‌లపై ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గ్రేటర్ HYD ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్ అని అధికారులను ప్రశ్నించారు. వీటితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, యాప్స్‌ను నమ్మి మోసపోవద్దని అన్నారు.

News March 16, 2025

భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

image

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.

error: Content is protected !!