News March 6, 2025
గద్వాలలో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి వేయ్యి జరిమానా విధిస్తూ MBNR ఫస్ట్ ADJ కోర్ట్ జడ్జి తీర్పు ఇచ్చారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గతంలో జిల్లా వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు ధర తక్కువగా వచ్చిందని మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కేసు నమోదు అయిందన్నారు.
Similar News
News December 5, 2025
ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.
News December 5, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

NH 161పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అల్లాదుర్గ్ కాయిదంపల్లి పెద్దమ్మ ఆలయం వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్.. కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేట్ మండలం మునిగేపల్లికి చెందిన కారు డ్రైవర్ సోయల్(25) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సిన సోయల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
News December 5, 2025
ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.


