News March 6, 2025
గద్వాలలో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి వేయ్యి జరిమానా విధిస్తూ MBNR ఫస్ట్ ADJ కోర్ట్ జడ్జి తీర్పు ఇచ్చారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గతంలో జిల్లా వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు ధర తక్కువగా వచ్చిందని మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కేసు నమోదు అయిందన్నారు.
Similar News
News April 10, 2026
ఇరాన్ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.
News April 10, 2026
పాడేరులో పర్యటించిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా.వర్ణాలి దేక అల్లూరి జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పీవో శ్రీపూజ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డైరెక్టర్ ముంతమామిడిలో బహుళ ప్రయోజక భవనం పరిశీలించారు.
News April 10, 2026
సిరిసిల్ల: జిల్లాలో ఈనెల 26 నుంచి స్వీయ గణన

ఈనెల 26 తేదీ నుంచి స్వీయ గణన ప్రక్రియ మొదలవుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో రాష్ట్ర జనాభా గణన కార్యాలయం జేడీ సుబ్బరాజు, అధికారులతో కలిసి శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈనెల 26 నుంచి మే పదవ తేదీ వరకు స్వీయ గణన సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలన్నారు.


