News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ప్రజాస్వామికంగా చర్చలు జరపాలి: పొన్నం

image

TG: పదేళ్లు అధికారంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గతంలోని పథకాలను కొనసాగిస్తూ అదనపు పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. చర్చలు ప్రజాస్వామికంగా ఉంటూ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయట్లేదని, స్పీకర్‌కు లేఖ రాసి <<16988692>>చర్చకు<<>> రావాలన్నారు. చర్చ జరిగితే ఎవరేంటో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు.

News July 8, 2025

ఉమ్మడి NZB జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అజ్మత్ హుస్సేన్

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉండగా అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను సోమవారం నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత అజ్మత్ ఉల్లా హుస్సేన్‌ను నియమించింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్‌గా ఉన్నారు.

News July 8, 2025

JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

image

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.