News March 20, 2025

గద్వాల్-డోర్నకల్ రైల్వే లైన్ అంచనా బడ్జెట్ రూ.5,330 కోట్లు

image

గద్వాల్-డోర్నకల్‌ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది. దీంతో రైల్వే లైన్ భూ సేకరణకు రూ.5,330 కోట్లు అవసరం అవుతాయని సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రానికి నివేదిక అందించింది. ఈ లైన్ పొడవు 296KM కాగా.. గద్వాల్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, సూర్యాపేట, మీదుగా డోర్నకల్ చేరనుంది. దీంతో ఢిల్లీ నుంచి సౌత్ ఇండియాలోని చెన్నై, తిరుపతి, తిరువనంతపురం వంటి ముఖ్య పట్టణాలకు వెళ్లవచ్చు.

Similar News

News December 10, 2025

VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

image

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.

News December 10, 2025

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: BHPL ఎస్పీ

image

రేపు పోలింగ్ జరిగే మొగుళ్లపళ్లి, కొత్తపల్లిగోరి, రేగొండ, గణపురం మండలాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ఉదయం ప్రారంభం నుంచే విధి స్థానాలకు హాజరు కావాలని,
ఓటర్లు ఇబ్బంది లేకుండా ఓటు వేయడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుమికూడటం నిషేధం అన్నారు.

News December 10, 2025

NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది