News February 13, 2026
గద్వాల్: రోకలిబండతో భర్తను చంపిన భార్య

వడ్డేపల్లి మండలం జులేకల్‌లో గురువారం రాత్రి ఘోరం జరిగింది. నిద్రిస్తున్న భర్త కురువ వెంకటరాములు (53)ను భార్య సరోజమ్మ రోకలిబండతో మోది హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. అప్పుల బాధలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. అప్పుల వారు తరచూ ఇంటికి వచ్చి వేధిస్తున్నా, భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన సరోజమ్మ ఈ దారుణానికి ఒడిగట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
జగిత్యాల మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అమావాస్య, ఉగాది సందర్భంగా మార్చి 18, 19వ తేదీల్లో మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్చి 20 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు గమనించి సహకరించాలని కోరారు.
News March 17, 2026
సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.
News March 17, 2026
మెట్రోలో గలీజ్ దందా.. పాత సామాన్లకే కొత్త రంగులేసి

METRO కోచ్‌ల మెయింటెనెన్స్ పేరుతో జరుగుతోన్న కొనుగోళ్లు, విదేశాల పార్టులు తెస్తున్నామని లోకల్ షెల్ కంపెనీల నుంచి పనికిరాని సామాన్లు కొంటున్నారు. మార్కెట్ రేట్ కంటే 40% అదనంగా బిల్లులేసి ట్యాక్స్ డబ్బుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పాతసామాన్లకే కొత్తరంగు పూసి ఇన్వెంటరీలో చూపిస్తున్నట్లు క్షేత్రస్థాయి ఆధారాలు చెబుతున్నాయి. పైఅధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోన్నట్లు ఉప్పల్, మియాపూర్ డిపోలలో టాక్.


