News April 1, 2025
గద్వాల: ‘అంబేడ్కర్ ఆలోచన పండగను విజయవంతం చేయాలి’

అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుడకల ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీన అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో 10 గంటలకు జరిగే పండగకు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కరిస్ట్లు తరలిరావాలని కోరారు.
Similar News
News April 4, 2025
గోపాలపురం: ఫ్యాన్కు ఉరేసుకొని మహిళ సూసైడ్

మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న సతామి కోటల్ (30)తో సునీల్ కోటల్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. బుధవారం వీరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంటిలో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోళ్ల ఫారం యజమాని సమాచారంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
News April 4, 2025
మరో నెల రోజులు ఆస్పత్రిలోనే కొడాలి నాని

AP: YCP నేత కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు. ఆయన అవయవాలన్నీ బాగానే స్పందిస్తున్నాయి. కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలోనే ఉంటారు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉండనున్నారు, త్వరలోనే కోలుకుని తిరిగి వస్తారు’ అని తెలిపారు.
News April 4, 2025
బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.