News April 5, 2025
గద్వాల: అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేద్దాం: నాయకులు

గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న నిర్వహించనున్న అంబేద్కర్ ఆలోచన పండుగ ర్యాలీ సభ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ, శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం, వారి విగ్రహం ఎదుట అంబేడ్కర్ ఆలోచన పండుగకు సంబంధించిన గోడపత్రికలను ప్రజాసంఘాల నాయకులు, బోధన సిబ్బంది, కార్యకర్తలు సంయుక్తంగా ఆవిష్కరించారు.
Similar News
News April 9, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞చాగలమర్రిలో రికార్డు స్థాయిలో 38⁰C ఉష్ణోగ్రత
☞రేవనూరు హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద భారీ పోలీస్ భద్రత
☞పాణ్యం రహదారిపై బొలెరో బోల్తా
☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA కోట్ల
☞క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ: నందికొట్కూరు MLA
☞ఫరూక్ ను పరామర్శించిన మంత్రి నిమ్మల
☞కోర్టు ఆదేశాలతో అంగన్వాడి హెల్పర్ రమాదేవి కొనసాగింపు: CDPO
☞డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
News April 9, 2025
GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

IPL: రాజస్థాన్ రాయల్స్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.
News April 9, 2025
పిడుగులు పడి 13మంది మృతి

బిహార్లో పిడుగుపాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో 13మంది మృతిచెందారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధుబనీ జిల్లాలో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగుపడటంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మెుత్తంగా 4 జిల్లాల్లో పిడుగుల కారణంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.