News April 5, 2025
గద్వాల: అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేద్దాం: నాయకులు

గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 12న నిర్వహించనున్న అంబేద్కర్ ఆలోచన పండుగ ర్యాలీ సభ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ, శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం, వారి విగ్రహం ఎదుట అంబేడ్కర్ ఆలోచన పండుగకు సంబంధించిన గోడపత్రికలను ప్రజాసంఘాల నాయకులు, బోధన సిబ్బంది, కార్యకర్తలు సంయుక్తంగా ఆవిష్కరించారు.
Similar News
News April 22, 2025
నేడు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ

AP: యూరప్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై చర్చిస్తారు. ఇది బీజేపీకే దక్కనుందని సమాచారం. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్‌తోనూ ఆయన సమావేశమవుతారు.
News April 22, 2025
MNCL: పెళ్లి పేరుతో మహిళను లోబర్చుకున్న నిందితుడు అరెస్ట్: ACP

INSTAలో పరిచయమై ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మహిళను లోబర్చుకున్న లక్షెట్టిపేటకు చెందిన పొన్నం వినయ్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు కేసు నమోదు చేయగా.. ఏసీపీ రత్నాపురం ప్రకాశ్ సాక్షులను విచారించారు. అలాగే మెడికల్, ఓరల్ సాక్ష్యాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
News April 22, 2025
నిర్మల్: హాల్‌టికెట్లు వచ్చేశాయ్..!

తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష సంబంధిత హాల్ టికెట్లు విడుదలైనట్లు కుంటాల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడించారు. విద్యార్థి యొక్క రిఫరెన్స్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు.