News April 1, 2025
గద్వాల: ‘అంబేడ్కర్ ఆలోచన పండగను విజయవంతం చేయాలి’

అంబేడ్కర్ ఆలోచన పండుగను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుడకల ప్రకాశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ చౌరస్తాలో కరపత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీన అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్నామన్నారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో 10 గంటలకు జరిగే పండగకు జిల్లా వ్యాప్తంగా అంబేడ్కరిస్ట్‌లు తరలిరావాలని కోరారు.
Similar News
News July 11, 2025
SRPT: తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి

నూతనకల్ మండలం మిర్యాలలో తాటిచెట్టు పైనుంచి జారిపడి <<17026525>>గీత కార్మికుడు<<>> గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య (50) రోజు మాదిరిగా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News July 11, 2025
HYD: AI డేటా సైన్స్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News July 11, 2025
GNT: నేడు విచారణకు హాజరు కానున్న అంబటి

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరు కానున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కోసం నేడు అంబటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు.