News April 5, 2025
గద్వాల: అది దారుణం: BRS

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని BRS రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గద్వాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించడం దారుణమన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హులు లేరా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
Similar News
News November 21, 2025
భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

HYD నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్న్యూస్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతి మంగళవారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్(07165) ట్రైన్, అలాగే ప్రతి బుధవారం భువనేశ్వర్ నుంచి నాంపల్లి (07166) ట్రైన్ ప్రయాణికులకు సేవలందిస్తాయన్నారు. వచ్చేనెల 23 వరకు ఈ ప్రత్యేక రైలు ఉంటుందన్నారు.
News November 21, 2025
సాకే గంగమ్మ మృతిపై వైఎస్ జగన్ సంతాపం

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సాకే గంగమ్మ ఇవాళ ఉదయం అనంతపురంలో తుదిశ్వాస విడిచారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, వైసీసీ నేతలు నివాళి అర్పించారు.
News November 21, 2025
సిటీలో మరో ఉపఎన్నిక? 3 రోజుల తర్వాత క్లారిటీ!

సిటీలో మరో ఉపఎన్నిక రానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్కు సమాధానం ఇవ్వలేదు. కాగా దానంకు స్పీకర్ 3రోజులు గడువిచ్చారు. ఈలోపు ఆయన నుంచి స్పందనరాకపోతే ‘అనర్హత’పై స్పీకర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక ఖరారైనట్లే.


