News March 29, 2025
గద్వాల: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు.. పోలీసుల WARNING

పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT
Similar News
News February 25, 2026
మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుందంటే?

ఎనీమియా రావడానికి ఐరన్ లోపం ప్రధాన కారణం. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణం వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గాల్లో అంతర్గతంగా రక్తస్రావం కావడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు.. వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి.
News February 25, 2026
డయేరియా, కల్తీ పాల ఘటనలపై సీఎం సమీక్ష

AP: శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాల ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
News February 25, 2026
నష్టాలు పూడ్చేందుకు మరో సినిమా చేయనున్న ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ప్రభాస్ స్వయంగా స్పందించి ఆ సంస్థకు మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. తన రెమ్యునరేషన్‌ని భారీగా తగ్గించుకుంటానని చెప్పారట. స్పిరిట్, ఫౌజీ చిత్రాలు పూర్తయ్యాక 2027లో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.


