News April 1, 2025

గద్వాల: అయిజకు రాష్ట్రంలో నాలుగో స్థానం..!

image

పన్ను వసూళ్లలో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సైదులు సోమవారం తెలిపారు. దీంతో అయిజ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అర్హత సాధించిందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 కోట్లు లక్ష్యం నిర్దేశించుకుని, నేటికి రూ.1.62 కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఇందుకు తమ కార్యాలయ సిబ్బంది విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు.

Similar News

News July 11, 2025

JMKT: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు ఏసీ బోగీ

image

సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్(12733 – 34) రైలుకు ఒక అదనపు ఏసీ బోగీ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 13 నుంచి ఈ అదనపు బోగీ అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు ఏసీ బోగీ ఏర్పాటుతో సెలవుల్లో వివిధ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్‌తో పాటు, సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

News July 11, 2025

శాఖాంబరీగా.. భద్రాకాళి దర్శనం

image

వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారిని ఉదయాన్నే ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News July 11, 2025

కరీంనగర్: ముఖ్య గమనిక.. రేపు స్క్రినింగ్ టెస్ట్

image

TG BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఈ నెల 12న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం12 గం. నుంచి 2గం. వరకు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరుగుతుందని సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. పరీక్షకు ఉమ్మడి KNR, MNCL జిల్లాల అభ్యర్థులు హాల్ టికెట్లను http://tgbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.