News March 4, 2025

గద్వాల: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: హృదయరాజ్ 

image

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 8,341 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

WGL: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

image

వరంగల్: పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్‌ ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్‌కు వారం రోజులే సమయం ఉండడం, బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.

News December 4, 2025

పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

image

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్‌ ఫాస్పెట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.

News December 4, 2025

హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.