News March 24, 2024
గద్వాల: ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి

బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. దేవేందర్ గౌడ్, జయలక్ష్మి దంపతుల కుమారుడు భూపతి గౌడ్(17) ఇంటర్ పరీక్షలు ముగియగా.. ఖాళీగా ఉన్నాడు. ఓ బావిలో ఈత కొడుతుండగా.. పూడికలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News November 6, 2025
పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
News November 6, 2025
నేడు పాలమూరులో అభినందన బైక్ ర్యాలీ

పాలమూరుకు యూజీడీ కోసం రూ.821 కోట్లు, తాగునీటి పైప్లైన్ కోసం రూ.221 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం ఉదయం 10:30 గంటలకు అభినందన బైక్ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ క్యాంపు కార్యాలయం శ్రీనివాస్ కాలనీ నుంచి క్లాక్ టవర్ వరకు సాగుతుందని డీసీసీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ సిరాజ్ ఖాద్రి తెలిపారు.
News November 5, 2025
నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


