News December 31, 2024
గద్వాల: ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు: అడిషనల్ కలెక్టర్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, వారికి తమ ఉత్తమ సేవలు గుర్తింపునిస్తాయని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో క్రీడల అధికారి ఆనంద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి ఆనంద్ విశేష కృషి చేశారని కొనియాడారు. క్రీడా కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
Similar News
News January 7, 2025
NRPT: స్కూల్‌కి వెళ్లమంటే ఉరేసుకున్నాడు
నారాయణపేట మండలం పెరపళ్లకి చెందిన <<15077017>>బాలుడు<<>> ఆంజనేయులు(15) ఉరేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బుగ్గమ్మ దంపతుల పెద్దకొడుకు ఆంజనేయులు 7వ తరగతి వరకు చదివి పొలం పనులు చేస్తూ, గొర్రెలు కాస్తున్నాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం శాసన్‌పల్లి శివారులో చెట్టుకు ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 7, 2025
పాలమూరులో 34,54,354 మంది ఓటర్లు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,43,276 మంది మహిళలు, 17,10.989 మంది పురుషులు ఉండగా ఇతరులు 89 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం 13,404 మంది ఓటర్లు పెరగటం గమనార్హం.
News January 7, 2025
MBNR: ‘ఈనెల 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం’
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ ఈనెల 16 వరకు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ ఫీజు చెల్లించని మొదటి, ద్వితీయ సంవత్సరం, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.