News December 31, 2024
గద్వాల: ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు: అడిషనల్ కలెక్టర్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, వారికి తమ ఉత్తమ సేవలు గుర్తింపునిస్తాయని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో క్రీడల అధికారి ఆనంద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి ఆనంద్ విశేష కృషి చేశారని కొనియాడారు. క్రీడా కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
Similar News
News January 13, 2025
NGKL: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా చేసుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికీ జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాలలో భోగభాగ్యాలు కలగాలని కోరారు.
News January 13, 2025
కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కల్వకుర్తిలోని <<15140785>>లారీ ఢీకొట్టిన<<>> ఘటనలో ఒకరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు, వంగూర్ మం. కోనేటిపురం వాసి శ్రీను రాచూరులోని కాఫీ కంపెనీలో పనిచేస్తున్నారు. అదివారం రాత్రి సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదుట కంపెనీ వాహనం కోసం వేచి ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగరాజు లారీ టైర్ల కిందపడి చనిపోగా శ్రీనును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 13, 2025
విద్యాసంస్థల్లో మతోన్మాదుల జోక్యం అడ్డుకోవాలి: ప్రొ.హరగోపాల్
పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. మతాలకు సంబంధించిన చిహ్నాలు, దుస్తులను విద్యాసంస్థల్లో నిషేధించాలని కోరారు. తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం రాములుపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.