News February 21, 2025

గద్వాల: ఉపాధి హామీలో పని కల్పించాలి: కలెక్టర్

image

జాబ్‌ కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం గట్టు మండలంలోని మండల మహిళా సమాఖ్య భవనాన్ని ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. జాబ్‌కార్డు సృష్టి, డేటా ఎంట్రీ వివరాలను, రిజిస్టర్‌లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో చర్చించి, ఉపాధి హామీ పనుల అమలుపై స్పష్టమైన సూచనలు అందించారు.

Similar News

News October 20, 2025

చంద్రబాబూ.. మీది ఏ రాక్షస జాతి: YCP

image

AP: 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపీడించాడని CM చంద్రబాబు చేసిన <<18052970>>వ్యాఖ్యలపై<<>> YCP మండిపడింది. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏ రకం రాక్షస జాతికి చెందిన వారు. ఎందుకంటే వరుసగా రెండుసార్లు 2004, 2009లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించారు. 2019లోనూ మట్టికరిపించారు. అసలు మీరు CM పీఠంలోకి వచ్చిందే.. NTR గారిని వెనక నుంచి పొడిచి. ఇది ఏ రాక్షసజాతి లక్షణం అంటారు’ అని ట్వీట్ చేసింది.

News October 20, 2025

తొగుట: కస్తూర్బా పాఠశాల.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

తొగుటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రివేళల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం బీరకాయ కూర, సాంబారు పెడుతున్నారా అని ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ, రాత్రి విధులు నిర్వహించే అధ్యాపకులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.

News October 20, 2025

రేపు ప్రజావాణి రద్దు: భద్రాద్రి కలెక్టర్

image

దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పండుగ సందర్భంగా జిల్లా అధికారులు ఉండరని, ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు