News April 6, 2025

గద్వాల: ఉరేసుకుని యువకుడి మృతి

image

గద్వాల మండలంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్, ఫరిదాబీల కొడుకు ఖాజా ఇంటర్ వరకు చదివాడు. HYDలో ఉద్యోగం చేసేవాడు. రంజాన్‌కు ఇంటికొచ్చి తిరిగెళ్లకపోవటంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన ఖాజా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Similar News

News April 18, 2025

MNCL: ఎల్లుండి నుంచే పరీక్షలు.. చదువుకున్నారా..?

image

జిల్లాలో పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్ పరీక్షలు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,192 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు గంట ముందు సెంటర్లకు హాజరు కావాలని సూచించారు.

News April 18, 2025

నిర్మల్: మండలాలకు చేరుతున్న ఎన్నికల సామగ్రి

image

సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్షన్లకు సామగ్రిని ఎంపీడీవో ఆఫీస్‌లకు చేరుకున్నాయి. గురువారం కుబీర్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఎలక్షన్ సామగ్రిని ఎంపీడీవో నవనీత్ కుమార్, ఎంపీఓ మోహన్ సింగ్ పరిశీలించారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధంగా ఉంటామని, జీపీల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో తెలిపారు.

News April 18, 2025

నాగర్‌కర్నూల్: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ నిందితులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

error: Content is protected !!