News April 25, 2024

గద్వాల: ఊయలగా కట్టిన చీర చుట్టుకొని మహిళ మృతి

image

ఊయలగా కట్టిన చీర గొంతుకు చుట్టుకొని మహిళ చనిపోయింది. పోలీసుల వివరాలు.. మల్దకల్‌కు చెందిన హేమలత, పరశురాముడు దంపతులు జ్యూస్ వ్యాపారం చేసి జీవిస్తున్నారు. రోజులాగే సోమవారం వ్యాపారం ముగించుకొని హేమలత ఇంటికి వచ్చింది. అప్పటికే చీరతో కట్టిన ఊయలో కుమార్తె ఊగుతుండగా.. ఇంట్లోకి వెళ్తున్న హేమలత గొంతుకు చీర చుట్టుకొని కిందపడింది. గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.

Similar News

News November 18, 2025

MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

image

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.