News April 1, 2025

గద్వాల: ‘ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలి’

image

రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

HYD: పడిపోలేదు.. జస్ట్ ఒరిగిందంతే!

image

చూడటానికి యాడ్ బోర్డుపై స్తంభం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్న ఈ విజ్యువల్ పెద్దఅంబర్‌పేట్ NH-65పైది. జులైలో భారీ ఈదరుగాలులు, వర్షం ధాటికి ఈ లైన్ ఏబీ స్విఛ్ స్తంభం కిందపడేది. కానీ బోర్డు పక్కనే ఉండటంతో దానిపై వాలింది. 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైవేపైన ఉన్నదానికే స్పందనలేకపోతే ఇక గల్లీల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 9, 2025

BREAKING: తూ.గో జిల్లాలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా

image

తూ.గో జిల్లాలో తెల్లవారుజామున పెనుప్రమాదం తప్పింది. పెరవలిలోని తీపర్రు వద్ద ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడం వలనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 9, 2025

వనపర్తి: గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థుల నానాతంటాలు

image

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు మటన్, మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. హోటళ్ల వద్ద టీ, టిఫిన్లకు కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, నాయకులు శ్రమిస్తున్నారు.