News August 11, 2024

గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ వైపు?

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే స్పష్టత లేదు. BRS నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 రోజుల క్రితం కేటీఆర్‌తో సమావేశమై BRSలో కొనసాగుతానన్నారు. పది రోజుల క్రితం మళ్లీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై బుజ్జగించారు. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంటుండడంతో చర్చనీయాంశంగా మారారు.

Similar News

News December 15, 2025

పాలమూరు: మూడో విడత పోలింగ్.. పటిష్ట బందోబస్తు: SP

image

పాలమూరు జిల్లాలో ఈనెల 17న జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. బాలానగర్, మూసాపేట, అడ్డాకుల, జడ్చర్ల, భూత్పూర్ మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు.

News December 15, 2025

మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

@మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
@మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ. డి.జానకి ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు.
@కౌకుంట్ల మండలంలో 12 గ్రామపంచాయతీలకు గాను.. 10 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
@దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పావని 110 ఓట్లతో గెలుపొందింది.
@ మిడ్జిల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.

News December 14, 2025

సీసీ కుంట నూతన సర్పంచులు వీరే !

image

అల్లిపూర్ శారదమ్మ
అమ్మాపూర్ – రంజిత్ కుమార్
బండార్ పల్లి – బత్తుల సుజాత
వడ్డేమాన్ – స్వప్న
సీసీ కుంట మానస – దమాగ్నాపూర్ పావని
ఏదులాపూర్ – ఆంజనేయులు
ఫర్దిపూర్ – శివకుమార్
గోప్య నాయక్ తండా – రాములు
గూడూరు – భీమన్న
లాల్ కోట – గోపాల్
మద్దూరు – దామోదర్
నెల్లికొండి – సుకన్య
పల్లమర్రి – లక్ష్మీ
సీతారాంపేట – హుస్సేన్ జీ
ఉంద్యాల -ఆంజనేయులు.