News March 22, 2025
గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.
Similar News
News September 15, 2025
రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.
News September 15, 2025
జగిత్యాల: ‘ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి’

ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్ఓలతో కలిసి స్వీకరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 31 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని తెలిపారు.
News September 15, 2025
జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.