News March 18, 2025
గద్వాల కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ టీచర్ల ధర్నా

పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.
News November 20, 2025
దేవ్జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్మెంట్ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.


