News February 26, 2026
గద్వాల కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా

జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్త కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జనగామ జిల్లా కలెక్టర్‌గా సేవలందించిన ఆయన, ఇకపై గద్వాల జిల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ పనిచేసిన బి.ఎం.సంతోష్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో రిజ్వాన్‌ను ప్రభుత్వం నియమించింది.
Similar News
News April 14, 2026
చిత్తూరు జిల్లా ‘మండుతోంది’

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఏడు మండలాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటాయి. అత్యధికంగా తవణంపల్లెలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, రొంపిచెర్లలో 40.7, శ్రీరంగరాజపురంలో 40.6, నిండ్రలో 40.5, గంగవరంలో 40.3, విజయపురంలో 40.0, పెద్దపంజాణిలో 39.6, బంగారుపాళ్యం, పులిచెర్ల మండలాల్లో 39.5 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.
News April 14, 2026
ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.
News April 14, 2026
వరంగల్: హెల్మెట్ లేకుంటే నో ఎంట్రీ

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనగామ(D) తరిగొప్పులలో ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధనను అమలు చేశారు. ఈ మేరకు SI శ్రీదేవి, MPDO దేవేందర్ రెడ్డి గ్రామ సరిహద్దుల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుంటే గ్రామంలోకి ప్రవేశం లేదని హెచ్చరించారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే నిబంధనను అమలు చేయడం విశేషం.


