News April 3, 2025
గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..!

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.
Similar News
News November 5, 2025
ఈ 4 కారకాలతోనే గుండె జబ్బులు: వైద్యులు

ఇటీవల గుండెపోటు మరణాలు పెరగడంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ‘99శాతం గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు. మొదటిసారి ఈ సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించాం. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, పొగతాగడం వంటివే ఆ కారకాలు. వీటిని నియంత్రించగలిగితే మీరు బయటపడినట్లే. తరచూ చెక్ చేసుకోండి’ అని వైద్యులు చెబుతున్నారు.
News November 5, 2025
శివాలయంలో ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక పూజలు

అన్నపురెడ్డిపల్లి శివాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు. కార్తీక్ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఆయన వెంట కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
News November 5, 2025
రెండో పెళ్లి రిజిస్టర్ చేయాలంటే మొదటి భార్య వాదన వినాలి: HC

ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషుడి బహుభార్యత్వానికి అనుమతి ఉంది. అయితే మొదటి భార్య బతికి ఉండగా చేసుకొనే రెండో పెళ్లిని గుర్తించాలంటే అధికారులు కొన్ని నిబంధనలు పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పెళ్లిని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య అంగీకారం ఉందో లేదో పరిగణనలోకి తీసుకోవాలంది. ‘ఇలాంటి సందర్భాల్లో మతాచారాలు సెకండరీ. రాజ్యాంగ హక్కులే సుప్రీం’ అని జస్టిస్ PV కున్హికృష్ణన్ పేర్కొన్నారు.


