News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.
Similar News
News November 14, 2025
భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కార్తీక శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
కాకినాడ- అనకాపల్లి మధ్య ఎయిర్ పోర్టు: CM

ఉమ్మడి తూ.గో జిల్లాలను ఎకనమిక్ రీజియన్లో చేర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గురువారం జరిగిన సదస్సులో 3 జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ- అనకాపల్లి మధ్య చిన్న ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కడియం నర్సరీలు, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తలసరి ఆదాయం కోనసీమ రూ.2.09 లక్షలు, కాకినాడ రూ.2.42L, తూ.గో రూ.2.59 లక్షలుగా ఉందన్నారు.


