News March 12, 2025

గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

image

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.

Similar News

News March 18, 2025

సిద్దిపేట: ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో ప్రాణాలపై తెచ్చుకోవద్దు: సీపీ

image

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్‌కి అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీపీ అనురాధ సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లను ప్రమోట్ (ప్రోత్సాహించే) వారి సమాచారం అందించాలని, బెట్టింగ్‌లపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, నమ్మి సందేశాలు, ఇతర వివరాలు పంపొద్దన్నారు.

News March 18, 2025

మోదీతో జోక్ చేసిన న్యూజిలాండ్ ప్రధాని

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్, మోదీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటీవల భారత్ CTకప్ గెలవటం మోదీ ప్రస్తావించలేదు. నేను కూడా భారత్ పై న్యూజిలాండ్ టెస్ట్ విజయాల టాపిక్ తీయలేదు. ఈ రెండు విషయాలను పక్కన పెడదామని క్రిస్టఫర్ చమత్కరించారు. దీంతో ప్రధాని మోదీ తోపాటు క్రికెటర్ రాస్ టేలర్ తదితరులు నవ్వులు చిందించారు.

News March 18, 2025

టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక 

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు. 

error: Content is protected !!