News February 12, 2026
గద్వాల: కౌంటింగ్‌కు 288 మంది సిబ్బంది..!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు 288 మంది సిబ్బందిని నియమించినట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 76 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. విధులకు 76 మంది సూపర్‌వైజర్లు, 152 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించి, రెండో విడత రాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. ప్రతి టీమ్‌లో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్స్ ఉండే విధంగా మొత్తం 76 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 16, 2026
వేసవి తాపం.. కల్లుకు ఫుల్ గిరాకీ!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు ముదురుతుండటంతో ప్రకృతి సిద్ధమైన తాటి కల్లుకు గిరాకీ అమాంతం పెరిగింది. బీర్ల ధరలు సామాన్యులకు భారంగా మారడం, కల్లులో ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం, ప్రోబయోటిక్స్ ఉండటంతో పాటు చలువ కావటంతో జనం తాటి వనాలకు క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే పట్టణ వాసులు అక్కడకి చేరుకుంటుండటంతో గీత కార్మికులకు మంచి ఉపాధి లభిస్తోంది. జిల్లాలో దాదాపు 16,500 మంది గీతకార్మికులు ఉన్నారు.
News March 16, 2026
HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.
News March 16, 2026
ఈ సినిమాలకు ‘ఆస్కార్’ దాసోహం

అసాధారణ ప్రతిభకు ‘ఆస్కార్’ అవార్డులు దాసోహమయ్యాయి. 13 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రం, దర్శకుడితో సహా 6 అవార్డులను కొల్లగొట్టింది. 16 నామినేషన్లతో చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ 4 అవార్డులు గెలుచుకోగా, ‘ఫ్రాంకెన్‌స్టైన్’ 3 సాంకేతిక అవార్డులను దక్కించుకుంది. ఇక ‘కెపాప్ డీమన్ హంటర్స్’ నామినేట్ అయిన 2 విభాగాల్లోనూ విజయం సాధించి 100% రిజల్ట్‌తో అదరగొట్టింది.


