News February 2, 2025
గద్వాల: గురుకుల ప్రవేశాలకు మరో అవకాశం

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గద్వాల జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News November 22, 2025
నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఎంపీ కడియం కావ్య

వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు అందరి సహకారంతో నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ కడియం కావ్య అన్నారు. ఉనికిచర్లలో ఆమె మాట్లాడుతూ.. నగర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు రూ.4 వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
News November 22, 2025
దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News November 22, 2025
నిర్మల్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

నిర్మల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం దేవస్థానాలు కూడా దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి చార్జి రూ.6,300 గా నిర్ణయించారు. ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9959226003, 8328021517, 7382842582 నంబర్లలో సంప్రదించండి.


