News February 2, 2025

గద్వాల: గురుకుల ప్రవేశాలకు మరో అవకాశం

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గద్వాల జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News February 18, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 18, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 18, 2025

శుభ ముహూర్తం (మంగళవారం, 18-02-2025)

image

తిథి: బహుళ షష్ఠి తె.4.34 వరకు
నక్షత్రం: స్వాతి
రాహుకాలం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, తిరిగి రా.10.48- రా.11.36
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.32 వరకు
అమృత ఘడియలు: రా.9.51 నుంచి రా.11.33 వరకు

News February 18, 2025

సిరిసిల్ల: అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి: ఎస్పీ

image

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.

error: Content is protected !!