News March 18, 2025
గద్వాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఈ నెల 15న పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. ధరూర్ మండలం మన్నాపూర్‌కి చెందిన అబ్రహాం(21) కుటుంబకలహాలు భరించలేక పురుగుమందుతాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 9, 2026
కాశీ సెట్లో హైఓల్టేజ్ యాక్షన్

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ సినిమా ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా కాశీ నగరాన్ని తలపించే భారీ సెట్లో యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్లో వచ్చే సీన్లను పూర్తి చేసిన మేకర్స్, ప్రస్తుతం హైఓల్టేజ్ యాక్షన్‌పై ఫోకస్ పెట్టారు.
News January 9, 2026
పార్వతీపురం: మన్యం కళావేదిక లోగో ఆవిష్కరణ

మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఆవిష్కరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతిక, సాహిత్య రంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదిక ఇదని పేర్కొన్నారు. జిల్లాలోని కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యమన్నారు.
News January 9, 2026
నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు!

నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ వన్ టైమ్ స్కీమ్(టీఎస్)ను ప్రకటించింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్టన్ తెలిపారు. ఈరాయితీ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందన్నారు.


