News August 1, 2024

గద్వాల: చిన్నారులపై కుక్కల దాడి

image

గద్వాలలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని 3వ వార్డు హమాలీ కాలనీలో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో హస్మిత, రుషి అనే ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటిముందు ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో గమనించిన స్థానికులు వాటిని తరిమికొట్టారు. అనంతరం వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీధి కుక్కలను దూర ప్రాంతానికి తరలించాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Similar News

News December 7, 2025

MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

image

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.

News December 7, 2025

MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్‌ల విత్‌డ్రా

image

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

News December 7, 2025

MBNR: సర్పంచ్‌ బరిలో 641 మంది అభ్యర్థులు

image

స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానాల కోసం 641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 133 గ్రామ పంచాయతీలకు గాను, జడ్చర్ల మండలంలో ఒకటి ఏకగ్రీవమవడంతో 132 జీపీలలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా బాలానగర్‌లో 37, జడ్చర్లలో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.