News March 11, 2025
గద్వాల: చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం: మంత్రి

చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ తెలంగాన సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
NZB: గ్రూప్-2 ఫలితాల్లో జిల్లా వాసికి 6వ స్థానం

గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను TGPSC విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్కు 430.807 మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు.
News March 12, 2025
దామరగిద్ద : రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…!

దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామంలో వరి నాట్లు వేసుకున్న రైతులకు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వాడుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.