News March 11, 2025
గద్వాల: చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం: మంత్రి

చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ తెలంగాన సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. గద్వాల నుంచి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Similar News
News March 11, 2026
అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.
News March 11, 2026
పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News March 11, 2026
సింగరేణికి ‘గని’ గండం.. నాలుగేళ్లలో మరో 10 మూత?

సింగరేణి సంస్థకు మరో నాలుగేళ్లలో గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. 2030 నాటికి మరో 10 గనులు మూతపడే అవకాశం ఉంది. సంస్థలో ఒకప్పుడు 56 భూగర్భ గనుల్లో 1.20 లక్షల మంది పని పనిచేసేవారు. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియా ,18 ఓపెన్ కాస్ట్,19 భూగర్భ గనులలో సుమారు 39వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకి 2.40 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా 1.50 లక్షల టన్నులు మాత్రమే తీస్తున్నారు.


