News March 28, 2025

గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

image

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Similar News

News January 8, 2026

చిత్తూరు: ఈ నెల 10న స్కూళ్లకు హాలిడే.!

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 10న రెండో శనివారం సెలవుగా ప్రకటించినట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలో ఆ రోజును ప్రత్యామ్నాయ పాఠశాల దినంగా గుర్తించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం 10న సంక్రాంతి సెలవు మంజూరు చేయడంతో పాఠశాలలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ రోజుకు ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సిన తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.

News January 8, 2026

NRPT: నారాయణపేట జిల్లా విలీనం కానుందా?

image

రాష్ట్రంలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. చిన్న జిల్లాలను పక్కన ఉన్న పెద్ద జిల్లాలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ ప్రకటనతో నారాయణపేట జిల్లాను పాలమూరు జిల్లాలో విలీనం చేయనున్నారని తెలుస్తుంది. గతంలోనూ కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పారు.

News January 8, 2026

నిర్మల్: బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి: TRP

image

రాష్ట్రంలోని బీసీలందరికీ సామాజిక న్యాయం జరగాలంటే వెంటనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. గురువారం నిర్మల్ కలెక్టరేట్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గైని సాయి మోహన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలన్నారు.