News April 11, 2025
గద్వాల జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో ఉన్న జమ్ములమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News February 28, 2026
ముంబైలో కెనడా ప్రధాని: టార్గెట్ $50 బిలియన్లు

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్, ఎనర్జీ, AI రంగాల్లో పార్ట్‌నర్‌షిప్‌ను పెంచుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. 2030 నాటికి $50 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ భావిస్తోంది. మార్చి 2న ప్రధాన మంత్రి మోదీతో కార్నీ భేటీ కానున్నారు.
News February 28, 2026
కాకినాడ: 48 బైక్‌లు చోరీ.. ఒక్కొ కేసుకు 2 ఏళ్ల శిక్ష: సీఐ

కాకినాడ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న శోంటిని గంగాధరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏకంగా 48 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరపరచగా ఒక్కో కేసుకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
News February 28, 2026
ఈరోజు నమాజ్ వేళలు (28-2-2026) శనివారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.23 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.35 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


