News March 20, 2025

గద్వాల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. హైవేపై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉండవెల్లి ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 28, 2025

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

image

మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని శుక్ర‌వారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్ర‌హానికి కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.

News November 28, 2025

NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

image

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

News November 28, 2025

21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

image

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.