News February 11, 2025
గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఇలా..

గద్వాల జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉండగా 3,88,196 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎర్రవల్లి నూతన మండలం ఏర్పాటు కావడంతో ఆ సంఖ్య 13కు చేరింది.
Similar News
News October 21, 2025
VKB: పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: ఎస్పీ

విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ప్రజలకు ఉన్నత సేవలు అందించే వారు పోలీసులని, వారి సేవలను వెలకట్టలేమని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి మాట్లాడారు. అమరుల త్యాగాలు మరువలేనివని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.
News October 21, 2025
స్పామ్ మెసేజ్ల నియంత్రణకు వాట్సాప్లో కొత్త ఫీచర్!

స్పామ్ మెసేజ్ల నియంత్రణకు WhatsApp ఓ ఫీచర్ను తీసుకొస్తోంది. యూజర్లు లేదా బిజినెస్ అకౌంట్స్ నుంచి అన్నోన్ నంబర్లకు పంపే బ్రాడ్కాస్ట్ మెసేజ్లకు లిమిట్ విధించనుంది. కొత్త నంబర్లకు మెసేజ్లు పంపినప్పుడు వారి నుంచి రిప్లైలు రాకపోతే ఆ మెసేజ్లన్నీ లిమిట్ లిస్టులో యాడ్ అవుతాయి. ఒక్కో మంత్లో నిర్దేశించిన లిమిట్కి చేరగానే మళ్లీ మెసేజ్లు పంపేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ దశలో ఉంది.
News October 21, 2025
KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.