News February 11, 2025

గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఇలా..

image

గద్వాల జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉండగా 3,88,196 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎర్రవల్లి నూతన మండలం ఏర్పాటు కావడంతో ఆ సంఖ్య 13కు చేరింది.

Similar News

News March 16, 2025

ఏలూరు జిల్లాలో దారుణం

image

బాలుడిని చైన్లతో కట్టేసి బంధించిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. బాధితుడి తండ్రి వివరాల మేరకు.. నిడమర్రు మండలం ఉప్పరగూడేనికి చెందిన బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. కొల్లేరులో గొర్రెలు కాస్తున్న తండ్రి వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో జిరాయితీ భూముల్లో బాలుడు చేపలు పట్టాడంటూ వెంకన్న, పండు అనే వ్యక్తులు బాలుడిని గ్రామంలోకి తీసుకెళ్లి కుక్కల గొలుసుతో కట్టేశారు. తర్వాత మందలించి బాలుడిని వదిలేశారు. 

News March 16, 2025

చిత్తూరులో చికెన్ ధరల వివరాలు

image

చిత్తూరు జిల్లాలోని పలు దుకాణాలలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బాయిలర్ కోడి కిలో రూ.114, లేయర్ కోడి రూ.90గా పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. కాగా బాయిలర్ కోడి మాంసం కేజీ. రూ.165, స్కిన్ లెస్ కేజీ రూ.185, లేయర్ కోడి మాంసం కేజీ రూ.153 పలుకుతోంది. మీ ప్రాంతాలలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 16, 2025

ఒక్క హిట్ కోసం ఈ హీరోల ఎదురుచూపులు!

image

టాలీవుడ్‌లో ఇటు చిన్న కథలు, అటు భారీ సినిమాలు చక్కటి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. కానీ మిడ్‌రేంజ్‌ హీరోలు మాత్రం ఆ మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీళ్లంతా హిట్ చూసి చాలాకాలమే అయింది. అటు మరీ చిన్న సినిమాలు చేయలేక, ఇటు భారీ బడ్జెట్ ఎంచుకోలేక సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నారు.

error: Content is protected !!